
బీజింగ్, అక్టోబర్ 27: దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందన్న కారణంతో ‘చైనా టెలికం’పై అమెరికా నిషేధం విధించింది. ‘చైనా టెలికం (అమెరికాస్) కార్పొరేషన్ తన కార్యకలాపాలను అమెరికా నేలపై నిర్వహించకూడదని, 60 రోజుల్లోగా నిలిపివేయాలని ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ (ఎఫ్సీసీ) ఆదేశించింది. చైనాలో ప్రభుత్వం ఆధ్వర్యంలోని మూడు అతిపెద్ద మొబైల్ తయారీ సంస్థల్లో చైనా టెలికం లిమిటెడ్ ఒకటి.