న్యూఢిల్లీ: అమెరికాలో విద్యాభ్యాసం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు అమెరికా శుభవార్త చెప్పింది. ఇటీవల తాత్కాలికంగా నిలిపివేసిన ఇంటర్వ్యూ షెడ్యూలింగ్‌ను మళ్లీ ప్రారంభించింది. అయితే సోషల్‌మీడియా వెట్టింగ్‌ను తప్పనిసరి చేసింది. ప్రభుత్వ రివ్యూ కోసం విద్యార్థులు తమ సోషల్ మీడియా ఖాతా వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. అమెరికా, అమెరికా ప్రభుత్వం, సంస్థలు, సంస్కృతి, విలువలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఏమైనా పోస్టులు పెట్టారా అన్నది పరిశీలించనున్నట్టు పేర్కొన్నది.
సోషల్ ఖాతాల పరిశీలనకు అనుమతించని వారి దరఖాస్తులను తిరస్కరిస్తామని స్పష్టంచేసింది. ఈ ఏడాది మే చివరి వారం నుంచి ప్రపంచవ్యాప్తంగా అమెరికా విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. వీసా ఇంటర్వ్యూల పునరుద్ధరణ కోసం విద్యార్థులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజా నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ వివరాలను కాన్సులేట్ అధికారులకు తప్పనిసరిగా అందజేయాలి. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులకు వచ్చే కొన్ని సందేహాలకు నిపుణులు సమాధానాలిచ్చారు.
ఎఫ్-1 (స్టూడెంట్ వీసా) లాంటి నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలన్నింటికీ(ఎఫ్, ఎమ్, జె విభాగల వీసాలకూ) ఈ నిబంధన వర్తిస్తుంది. గత అయిదేండ్లుగా దరఖాస్తుదారు తాను ఉపయోగించిన సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను దరఖాస్తులో పేర్కొనాలి.
వ్యక్తుల సోషల్ మీడియా పోస్టులు వారి ప్రవర్తనను, ఆలోచనలను, భాగస్వామ్యాలను తెలియజేస్తుంది.
ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, లింక్డ్ఇన్, రెడ్డిట్, టిక్‌టాక్, స్నాప్‌చాట్, పింటరెస్ట్, టంబ్ల్,్ర డబన్(చైనా) లాంటి 20 ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఖాతాలు. (గమనిక – ఈ జాబితా సమయానుగుణంగా మారొచ్చు.)
మీరు చేసిన పోస్ట్‌లు చక్కగా, రాజకీయేతర అంశాల గురించి ఉంటే ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. అయితే మీ పబ్లిక్ పోస్టులను సమీక్షించుకోవడం మంచిది. అయితే గతంలోని పోస్టులను దాచి పెట్టడానికి, తప్పుగా చూపడానికి ప్రయత్నం చేయొద్దు. పాత పోస్టులను తొలగించొద్దు. దరఖాస్తు సమీక్ష సమయంలో మీ సోషల్ మీడియా ప్రొఫైల్‌ను పబ్లిక్ అందరికీ కనిపించేలా పెట్టాలి.
లేదు. కేవలం యూజర్ నేమ్స్, హ్యాండిల్స్ వివరాలు మాత్రమే ఇవ్వాలి.
అవును. మీరు తొలగించిన, యాక్టివ్‌లో లేని, వాడని సోషల్ మీడియా ఖాతాల వివరాలు కూడా ఇవ్వాలి. ఉద్దేశపూర్వకంగా వాటి వివరాలు పేర్కొనకపోతే తప్పుడు వివరాలు ఇచ్చినట్టు పరిగణించే ప్రమాదం ఉంటుంది.
అవును. నకిలీ ఖాతా వివరాలను ఇస్తే వాటిని తప్పించుకొనే ప్రయత్నంగా పరిగణించవచ్చు.
లేదు.
ఓ వ్యక్తి సోషల్ మీడియా ఖాతాలను, అతడి పోస్టుల వెనుక ఉన్న ఉద్దేశాలను పరిశీలించడం. అమెరికా ప్రజలు, సంస్కృతి, ప్రభుత్వం, సంస్థలు, ఆ దేశ సిద్ధంతాలకు వ్యతిరేక భావనలు దరఖాస్తుదారులో ఉన్నాయేమోనని యూఎస్ స్టూడెం ట్ వీసా ఇంటర్వ్యూలో పరిశీలిస్తారు.