America Elections | కమలా హారిస్.. డొనాల్డ్ ట్రంప్.. ఎవరు గెలిస్తే భారత్‌కు మేలు?
అమెరికా ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడింది. నవంబరు 5న ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ తరపున ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హోరాహోరీ తలపడుతున్నారు.
- నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు
- హోరాహోరీగా తలపడుతున్న ట్రంప్, కమల
- భారత్ కోణంలో ఎవరు గెలిస్తే మంచిది?
America Elections | న్యూఢిల్లీ, అక్టోబర్ 22: అమెరికా ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడింది. నవంబరు 5న ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ తరపున ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హోరాహోరీ తలపడుతున్నారు. ఇప్పటికే ప్రచారం ఊపందుకున్నది. అయితే, భారత్ కోణంలో చూస్తే ట్రంప్ అధ్యక్షుడైతే మంచిదా? భారతీయ మూలాలు ఉన్న కమలా హారిస్ అధ్యక్షురాలైతే మేలా? అనే ఆసక్తికర చర్చ భారత్‌తో పాటు ప్రవాస భారతీయుల్లో జరుగుతున్నది.
ఆర్థిక విధానాలు
వాణిజ్యపరంగా భారత్‌కు అమెరికా చాలా కీలకం. భారతదేశ మొదటి 10 వాణిజ్య భాగస్వామ్య దేశాల్లో అమెరికాతోనే మనకు ట్రేడ్ సర్ప్లస్ ఉంది. అంటే మనం అమెరికా నుంచి చేసుకుంటున్న దిగుమతుల కంటే మనం అమెరికాకు చేస్తున్న ఎగుమతులే ఎక్కువ. భారత్‌తో వాణిజ్యం గురించి ట్రంప్ పదేపదే మాట్లాడుతున్నారు. దిగుమతులపై భారత్ ఎక్కువగా పన్నులు వేస్తున్నదని ఆయన ఆరోపిస్తున్నారు. తాను గెలిస్తే ఈ పరిస్థితిని మార్చేస్తానని చెప్తున్నారు. ఇది భారత్‌కు కొంత ఇబ్బందికరమే. మరోవైపు కమలా హారిస్ సైతం అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా విధానాలను రూపొందించవచ్చు. అయితే, ఇవి మరీ అసాధారణంగా ఉండకపోవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి.
సాంకేతిక రంగం
ట్రంప్ గెలిచినా, కమలా హారిస్ గెలిచినా చైనాతో మాత్రం కొంత దూకుడుగానే వ్యవహరించవచ్చు. భారత్‌లో సెమీకండక్టర్ ఫాబ్రికేషన్ కేంద్రం ఏర్పాటుకు, ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, అంతరిక్ష, 6జీ మొబైల్ సాంకేతికత, సెమీకండక్టర్ వంటి అధునాతన సాంకేతికతలపై కలిసి పని చేసేందుకు భారత్, అమెరికా ఇటీవలే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సాంకేతిక రంగంలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు ప్రస్తుత బైడెన్ సర్కారు ప్రయత్నించింది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా బైడెన్ పాటించిన విధానాలను కొనసాగించవచ్చు. ఇది పరోక్షంగా భారత్‌కు మేలు కలిగిస్తుంది.
దౌత్య సంబంధాలు
గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఉన్నా, అధ్యక్షుడు రిపబ్లికన్ అయినా, డెమోక్రట్ అయినా భారత్‌తో మాత్రం సంబంధాలు బలపడుతున్నాయి. ట్రంప్ గెలిచినా, కమల గెలిచినా ఇదే కొనసాగవచ్చు. అయితే, ట్రంప్‌తో మన ప్రధాని మోదీకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇదే సమయంలో కమలా హారిస్‌కు భారతీయ మూలాలు ఉండటం కూడా భారత్‌తో సంబంధాలను బలోపేతం చేయవచ్చు.
వలస విధానం
వలస విధానం విషయంలో ట్రంప్ ఆలోచనలు, విధానాలు కొంత కఠినంగానే ఉంటాయి. ఈ ఎన్నికల్లోనూ ఆయన ఇమ్మిగ్రేషన్ విధానంపై ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. అక్రమ వలసదారులపై ట్రంప్ కఠినంగా వ్యవహరించవచ్చు. భారతీయులకు కీలకమైన హెచ్1బీ వీసాలపైనా పరిమితులు విధించవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించి కమలా హారిస్ విధానాలు కొంత వలసదారులకు అనుకూలంగా ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

