హైదరాబాద్ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో తొమ్మిదేండ్ల తర్వాత చైనాలో (China) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. చైనా అధ్యక్షుడు (China President) జీ జిన్‌పింగ్ (XI Jinping) ఆహ్వానం మేరకు ట్రంప్ ఆ దేశంలో పర్యటిస్తున్నారు. ఇరాన్‌తో యుద్ధం తీవ్రమవుతున్న క్రమంలో ప్రపంచంలోని రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య సంబంధాలను స్థిరీకరించడానికి ట్రంప్ కొత్త ఒరవడిని తీసుకువచ్చారు.
అమెరికా, ఇరాన్ యుద్ధ నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని తెరిపించేలా చైనాతో చర్చింనున్నట్లు సమాచారం. రాజకీయంగా ట్రంప్ క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా ఇది జరుగుతున్నది. ఈ పరివారంలో ఎలాన్ మస్క్, జెన్సాన్ హువాంగ్ కూడా ఉన్నారు. ట్రంప్‌కు చైనా ఉపాధ్యక్షుడు హన్ జెంగ్, సీనియర్ అధికారులు స్వాగతం పలికారు. కాగా, ట్రంప్ చివరిసారిగా తన తొలి టర్మ్‌లో 2017లో అధ్యక్ష హోదాలో చైనాను సందర్శించారు.