Hyderabad | హైదరాబాద్‌లోని ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మాణంలో ఉన్న ఎలివేటెడ్ కారిడార్‌కు ‘బండారి రాజిరెడ్డి కారిడార్’గా నామకరణం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉప్పల్ నియోజకవర్గానికి బండారి రాజిరెడ్డి చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ ఈ పేరును మార్చినట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఉప్పల్ నియోజకవర్గ ప్రజల నుంచి అందిన వినతుల నేపథ్యంలో మల్కాజిగిరి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఈ ప్రతిపాదనను ఆమోదించి, ఫిబ్రవరి 9న ప్రభుత్వానికి నివేదించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు బండారి రాజిరెడ్డి ఎలివేటెడ్ కారిడార్‌గా మారుస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు.

Bandari Rajireddy Elevated