Siraj | టీమిండియా స్పీడ్‌స్టర్ మహమ్మద్ సిరాజ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. తన పదునైన బౌలింగ్‌తో మైదానంలో ప్రత్యర్థులను చిత్తు చేసే ఈ హైదరాబాదీ పేసర్, ఇప్పుడు వ్యక్తిగత జీవితంతో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాడు. ప్రముఖ టీవీ నటి, ‘బిగ్ బాస్’ ఫేమ్ మహిరా శర్మతో డేటింగ్లో ఉన్నాడనే వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. ఇటీవల అహ్మదాబాద్‌లోని ఓ లగ్జరీ రెస్టారెంట్ బయట సిరాజ్, మహిరా కలిసి కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాకుండా వీరిద్దరూ ఒకే ప్రాంతంలో కలిసి తిరుగుతున్న ఫోటోలు బయటకు రావడంతో, వారి మధ్య సంబంధంపై ఊహాగానాలు మరింత పెరిగాయి.
ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా వీరిద్దరి ప్రేమాయణంపై ఇలాంటి వార్తలు వచ్చాయి. అప్పట్లో మహిరా శర్మ స్పందిస్తూ తామిద్దరం కేవలం స్నేహితులమేనని స్పష్టం చేసింది. మరోవైపు సిరాజ్ కూడా నిరాధార వార్తలను నమ్మవద్దని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అయితే ఆ పోస్ట్ కొద్దిసేపటికే డిలీట్ చేయడం అప్పట్లో మరింత చర్చకు దారితీసింది. ప్రస్తుతం మళ్లీ ఈ జంట కలిసి కనిపించడంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు “వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది.. త్వరలో అధికారిక ప్రకటన రావచ్చు” అంటుంటే, మరికొందరు “సెలబ్రిటీలు కలిసి కనిపిస్తే అది తప్పనిసరిగా ప్రేమే కావాల్సిన అవసరం లేదు” అని అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటివరకు ఈ తాజా రూమర్స్‌పై అటు సిరాజ్ గానీ, ఇటు మహిరా శర్మ గానీ స్పందించలేదు. ప్రస్తుతం ఐపీఎల్ , అంతర్జాతీయ మ్యాచ్‌లతో బిజీగా ఉన్న సిరాజ్ తన ఆటపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికి క్రికెట్, గ్లామర్ ప్రపంచాల మధ్య సాగుతున్న ఈ బంధం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి కూడా ఈ వార్తలు పుకార్లుగానే మిగిలిపోతాయా? లేక ఈ జంట తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.