
ఉప్పల్, జనవరి 26: ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను ఉప్పల్ ఎమ్మె ల్యే బేతి సుభాష్‌రెడ్డి బుధవారం కలిశారు. ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలతో కూడిన పత్రాలను మంత్రికి అందజేశారు. నియోజకవర్గంలోని 36 కాలనీల క్రమబద్ధీకరణ, చెరువులు సుందరీకరణ, డబుల్ బెడ్రూం ఇండ్లు, పార్కులు, తదితర అంశాలను ప్రస్తావించారు. అనంతరం, నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి రావాలని కోరారు. కార్ల పేర్లు, లోగోల అంశాలలో గిన్నిస్ రికార్డు సాధించిన రెండున్నరేండ్ల సమ్రీత్ను, వారి తల్లిదండ్రులను మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే పరిచయం చేశారు. ఈ సందర్భంగా చిన్నారిని మంత్రి అభినందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, డివిజన్ అధ్యక్షులు వేముల సంతోష్‌రెడ్డి, సుడుగు మహేంద్రారెడ్డి, కాసం మహిపాల్‌రెడ్డి, గుండారపు శ్రీనివాస్‌రెడ్డి, పల్లా కిరణ్ కుమార్ రెడ్డి, మేకల ముత్యంరెడ్డి, పల్లె నర్సింగరావు, డాక్టర్ బీవీ చారి పాల్గొన్నారు.