Savariya Basanth’s Case : వారం క్రితం ఉబ్బెకిస్థాన్లో హత్యకు గురైన 22 ఏళ్ల కేరళ వైద్య విద్యార్థిని సావారియా బసంత్ (Savariya Basanth) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమబిడ్డను అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారంటూ పోలీసులను ఆశ్రయించారు కుటుంబసభ్యులు. మతమార్పిడికి బలవంతం చేసి, చిత్రహింసకు గురి చేసి తమ కూతురిని హత్య చేశారని వారు ఫిర్యాదు చేశారు.
వైద్య విద్యార్థిని సావారియా బసంత్ హత్యపై హత్యపై సమగ్ర విచారణ కోరుతున్న ఆమె కుటుంబసభ్యులు బుధవారం జిల్లా ఎస్పీ, అధికారులను కలిశారు. స్థానిక హరిపడ్ పోలీస్ స్టేషన్లో వారు ఫిర్యాదు చేయగా మర్డర్ కేసు నమోదైంది. కేసు విచారణను వేగవంతం చేయాలని కేరళ పోలీసులను కోరిన కుటుంబీకులు.. హంతకుడిని భారత్‌కు రప్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కేసుపై కాయంకులం డీప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బిను కుమార్ స్పందించారు. విదేశంలో వైద్య విద్యార్థిని చనిపోయినప్పటికీ తాము కేసు ఫైల్ చేశామని చెప్పారు.
उज़्बेकिस्तान में भारतीय छात्रा की मौत।
क्लासमेट द्वारा कन्वर्ट की कोशिश के लगे आरोप।
उज़्बेकिस्तान के बुखारा स्टेट मेडिकल इंस्टीट्यूट में पढ़ने वाली केरल की 21-वर्षीय मेडिकल छात्रा सावरिया बसंत की कथित तौर पर हत्या कर दी गई है।
स्थानीय पुलिस ने सहपाठी और आरोपी सदरुल को… pic.twitter.com/yTl0i8jxez
— Panchjanya (@epanchjanya) July 10, 2026
‘ఉజ్బెకిస్థాన్‌లో హత్య జరిగినప్పటికీ.. నిబంధనల ప్రకారం మేము కేసు నమోదు చేశాం. అక్కడి పోలీసులు దోషికి శిక్ష వేస్తేమేము ఇక్కడ కేసును మూసేస్తాం. కానీ, ఉజ్బెకిస్థాన్‌లో ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే మేము ఈ కేసును ఛేదించేందుకు సిద్ధంగా ఉన్నాం అని వెల్లడించారు. అంతేకాదు ఈ కేసు విచారణ గురించి తెలుసుకునేందుకు ఉజ్బెకిస్థాన్‌లోని భారత రాయబారి కార్యాలయం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటామ’ని పీటీఐతో ఆయన తెలిపారు. అలప్పుజా వైద్య కళాశాలలో సవారియా బసంత్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించామని ఒక పోలీసు అధికారి తెలిపారు.
ఉజ్బెకిస్థాన్‌లో వైద్య విద్యనభ్యసిస్తున్న సావారియా బసంత్‌ను ఆమెతో పాటే చదువుకుంటున్న విద్యార్థి సదరుల్ అనమ్ దారుణంగా హత్య చేశాడు. నిందితుడు అనమ్ ల్యాప్‌టాప్‌తో ఆమె తలపై కొట్టి చంపేశాడు. అయితే.. ఈ హత్యకు మతమార్పిడి కోణం ఉందని సవారియా కుటుంబం ఆరోపిస్తోంది. తమ కూతురి మృతదేహంపై పలు చోట్ల గాయాలు ఉన్నాయని, మతమార్పిడికి పాల్పడాలని ఒత్తిడి చేసి.. తమ బిడ్డను చిత్రహింసకు గురి చేసి చంపారని వారు కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
The family of 22-year-old Malayali medical student Savariya Basanth, who was allegedly murdered by her classmate in Uzbekistan, has alleged that she was brutally assaulted before her death.
Savariya, a native of Pilappuzha in Haripad, Alappuzha district, was allegedly killed by… https://t.co/Wm0EtR7gSN pic.twitter.com/SSR4DDXQaE
— Hate Detector 🔍 (@HateDetectors) July 9, 2026