హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీజీ ఐసీసీసీ)లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్(డ్రైవర్స్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం 23 ఖాళీల భర్తీ కోసం రాష్ట్రానికి చెందిన మాజీ సైనికులు, పారామిలిటరీ మాజీ సిబ్బంది దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
నెలకు గౌరవ వేతనం రూ. 26,000 ఉంటుందని, ఎలాంటి సెలవులు ఉండబోవని పేర్కొన్నారు. 31-07-2026 నాటికి 58 ఏండ్లలోపు ఉండాలని, సర్వీస్ నుంచి రిటైర్ అయి రెండేండ్లు దాటకూడదని పేర్కొన్నారు. ఏఎంబీ/హెచ్ఎంవీ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని పేర్కొన్నారు. వివరాలకు 8712674111 నంబర్లో సంప్రదించాలని సూచించారు.