తిరుమల : కేంద్ర రోడ్డు రవాణా , రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ( Nitin Gadkari ) శనివారం తిరుమలలో ( Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కేంద్ర మంత్రికి ఆలయ మర్యాదల ప్రకారం ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఆలయ పూజారులు గర్భగుడి వరకు తీసుకెళ్లి దర్శనం తర్వాత, రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. శ్రీవారి ఫోటో, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాధం తదితరులున్నారు .