హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): నైని బొగ్గు గనుల వ్యవహారంలో మంత్రులు రెండు వర్గాలుగా వి డిపోయి గొడవలు పడుతున్నారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సింగరేణిని ‘కాంగ్రెస్ ప్రైవే ట్ లిమిటెడ్’గా మార్చుకుందని మండిపడ్డారు. 17 కంపెనీలు విజిట్ చేస్తే ఒక్క కంపెనీకి కూడా సర్టిఫికెట్ ఇవ్వలేదని విమర్శించారు.