హైదరాబాద్: తెలంగాణలో క్రీడాభివృద్ది కార్యక్రమాల పరిశీలన కోసం కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి అతుల్‌సింగ్ హైదరాబాద్‌కు వచ్చారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా అతుల్‌సింగ్ పలు అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించారు. మెదక్, హనుమకొండ, కరీంనగర్‌లోని అథ్లెటిక్స్ ట్రాక్ నిర్మాణ పనులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో కలిసి అతుల్‌సింగ్ చర్చించారు. అనంతరం ఉస్మానియాలో అథ్లెటిక్స్ ట్రాక్, సింథటిక్ టెన్నిస్ కోర్టు, మహిళల కోసం స్విమ్మింగ్‌ఫూల్ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.