హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారిని కేంద్ర హోంమంత్రి అమిత్షా దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద ఆయనకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో అమిత్షా దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు.
దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత దర్శనందివ్యాంగులు, వృద్ధులకు నేరుగా శ్రీవారి ఉచిత దర్శనం కల్పించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతించనుంది.