న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.5,316 కోట్ల ఏకీకృత నికర లాభాలను ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ. 4,985 కోట్లతో పోలిస్తే 6.6 శాతం వృద్ధిని కనబరిచింది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.32,752.67 కోట్ల నుంచి రూ.31,851.15 కోట్లకు పడిపోయినట్టు వెల్లడించింది. ఏడాది క్రితం 3.6 శాతంగా ఉన్న బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ గత త్రైమాసికానికిగాను 2.82 శాతానికి దిగొచ్చింది. అలాగే నికర ఎన్పీఏ 0.63 శాతం నుంచి 0.48 శాతానికి తగ్గింది. మరోవైపు, గతఏడాదికిగాను రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకూ రూ.5 డివిడెండ్‌ను బోర్డు ప్రతిపాదించింది.