చిక్కడపల్లి, జనవరి 31 : నిరుద్యోగుల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వారిని మోసం చేస్తుందని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ విమర్శించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఈ నెల 3,4న ఇందిపార్క్ ధర్నాచౌక్ వద్ద 48 గంటలపాటు నిరుద్యోగ దీక్ష చేపడుతున్నట్టు వెల్లడించారు. శుక్రవారం చిక్కడపల్లిలోని నగర గ్రంథాలయ ప్రాంగణంలో దీక్ష పోస్టర్‌ను నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్‌తో కలిసి ఆవిష్కరించారు.
కాంగ్రెస్ జాతీయ నాయకులు ప్రియాంకగాంధీ, రాహుల్‌గాంధీ అశోక్‌నగర్‌లో యూత్ డిక్లరేషన్ ప్రకటించారని, జాబ్ క్యాలెండర్ పెడుతామని చెప్పారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా హామీలు అమలు చేయలేదని, ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన అభివృద్ధిలో కమీషన్లు వస్తాయి కాబట్టే దానిపై దృష్టి పెట్టారని, ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగులు ఏమీ ఇవ్వరనే వారిపై వివక్ష చూపుతున్నారని పేర్కొన్నారు. నిరుద్యోగ నిరాహార దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.