హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): పోలీసు ఉద్యోగాల కోసం చెమటోడుస్తున్న నిరుద్యోగ అభ్యర్థులు రాజకీయ ప్రేరేపిత ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై గోపిరెడ్డి శనివారం ప్రకటనలో కోరారు. ఎన్నికల లబ్ధికోసం, రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగులను రోడ్లపైకి నెట్టి ఉచ్చులోకి లాగేందుకు కొన్ని శక్తులు వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.