కన్నడ అగ్రనటుడు శివరాజ్‌కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్న స్పై డ్రామా ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’. డాలీ ధనంజయ, ప్రియాంక మోహన్, అదితి బాలన్ కీలక పాత్రధారులు. హేమంత్ ఎం.రావు దర్శకుడు. వైశాఖ్ జె.గౌడ నిర్మాత. ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. అనుభవం ఉన్న ఏజెంట్, వృద్ధిలోకి రావాలనుకుంటున్న ఏజెంట్, మాస్క్ మేన్, వీళ్లందరి కళ్లుగప్పే ఓ నీచుడు, ఓ తల్లి.. ఈ పాత్రల చుట్టూ ఈ కథ నడుస్తుందని టీజర్ తెలిపింది. టీజర్‌లోని ప్రతి అంశం సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇందులో ఏజెంట్ ప్రకాష్‌గా శివరాజ్‌కుమార్ కనిపించారు.
ఆయన స్క్రీన్‌ప్రెజెన్స్ ఈ టీజర్‌కి హైలైట్. డాలీ ధనంజయది ఇందులో కీలకమైన పాత్ర అని టీజర్ చూస్తే అర్థమవుతుంది. వింటేజ్ సినిమా గురించి వినడమే తప్ప ఇప్పటివరకూ చూడని వారికి, ఈ సినిమా ఓ కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందని, సాంకేతికంగా ఇదొక అద్బుతమని, ఆడియన్‌ని ఓ వినూత్న ప్రపంచంలోకి తీసుకెళ్లే సినిమా ఇదని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: అద్వైత గురుమూర్తి, సంగీతం: చరణ్‌రాజ్.