ఉమ్రాన్ మాలిక్ హరికేన్.. ప్రశంసలు కురిపించిన చిదంబరం
ముంబై: సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తన స్పీడ్ బౌలింగ్‌తో బెంబేలెత్తిస్తున్న ఈ యువ పేసర్ అందర్నీ అట్రాక్ట్ చేస్తున్నాడు. నిజానికి బుధవారం గుజరాత్‌తో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ఓడినా.. ఉమ్రాన్ మాలిక్ మాత్రం తన స్పీడ్‌తో థ్రిల్ చేశాడు. అతివేగవంతమైన బంతులు వేస్తూ.. 5 వికెట్లు తీశాడు. దాదాపు మ్యాచ్‌ను గెలిపించేంత పనిచేసినా.. చివరకు గుజరాత్ బ్యాటర్లు చెలరేగడంతో సన్‌రైజర్స్ జట్టు ఓటమి పాలైంది.
ఉమ్రాన్ మాలిక్ పేస్ బౌలింగ్‌కు మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కూడా క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఉమ్రాన్ మాలిక్ ఓ హరికేన్ అని, అడ్డొచ్చిన ప్రతిదాన్ని తూడ్చిపడేస్తున్నాడని, అతని వేగం, దూకుడు ఆకట్టుకుంటోందని, ఈ యేటి ఐపీఎల్లో అతడి పర్ఫార్మెన్స్ అమోఘమని చిదంబరం ట్వీట్ చేశారు. ఉమ్రాన్ మాలిక్‌కు ఓ ప్రత్యేకమైన కోచ్‌ను ఏర్పాటు చేసి, అతన్ని జాతీయ జట్టులోకి తక్షణమే తీసుకోవాలని చిదంబరం అభిప్రాయపడ్డారు.
మరో మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ కూడా ఇటీవల మాలిక్‌ను విశేషంగా మెచ్చుకున్నారు. అతని ట్యాలెంట్ అద్భుతంగా ఉందని, అతన్ని ఇండియా జట్టులోకి తీసుకోవాలని, ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ మ్యాచ్‌లకు అతన్ని తీసుకోవాలని, బుమ్రాకు తోడుగా మాలిక్ కలిస్తే అదిరిపోతుందని శశి థరూర్ ఓ ట్వీట్లో అన్నారు.
The Umran Malik hurricane is blowing away everything in its way
The sheer pace and aggression is a sight to behold
After today’s performance there can be no doubt that he is the find of this edition of IPL
— P. Chidambaram (@PChidambaram_IN) April 27, 2022
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power cuts | కరెంటు కోతలను నిరసిస్తూ నార్సింగి సబ్‌స్టేషన్ ఎదుట రైతుల ధర్నా
AICWA | తనుశ్రీ దత్తా వ్యాఖ్యలపై ఏఐసీడబ్ల్యూఏ ఆగ్రహం.. ‘ఈవిల్ డెడ్’ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సినీ సంఘం!
KTR | కేసులు నమోదైన రైతులను పరామర్శించిన కేటీఆర్, మాజీ మంత్రులు
Steven Smith | స్మిత్ ఖాతాలో మరో మైలురాయి.. మూడో ఆస్ట్రేలియన్‌గా రికార్డు..!
Hanuman Ansh | ‘హనుమాన్ అంశ్’ రివ్యూ.. నీమ్ కరోలీ బాబా జీవితం తెలుగువారిని మెప్పించిందా..?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

