కీవ్: శత్రు దేశపు యుద్ధట్యాంకుపై ఎక్కి, స్వదేశ పతాకాన్ని రెపరెపలాడించాడు ఓ ఉక్రెయిన్ పౌరుడు. రష్యా దాడులను నిరసిస్తూ పలువురు ఉక్రెయిన్ పౌరులు వీధుల్లో ఆందోళనలు చేపడుతున్నారు. ఇంతలో వీధుల్లోంచి వెళ్తున్న ఓ రష్యా యుద్ధ ట్యాంకుపైకి ఎక్కిన ఉక్రెయిన్ పౌరుడు.. ఇలా తమ జాతీయ జెండాను ఎగురవేశాడు. దీంతో అక్కడున్న మిగతా ఉక్రెయిన్ పౌరులు తమ జెండాకు అభివాదం చేస్తూ గట్టిగా నినదించారు.