కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేకపోవడంతో తెలుగు సంవత్సరాది ఉగాది పం డుగను రంగారెడ్డి జిల్లాలోని ప్రజలు జరుపుకొనేందుకు ఆసక్తి, ఉత్సాహం చూపడం లేదు. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు మేలు జరిగేలా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంతో ప్రజలు ఎంతో సంతోషంగా పండుగలు నిర్వహించుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా మా రింది. రైతులు, మహిళలు, యువకులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల వారు నిరుత్సాహంగా ఉన్నా రు.
అడుగంటిన భూగర్భజలాలతో బోరుబావుల్లో నీరులేక ఎండిపోతున్న పంటలను చూసి కన్నీరు పెట్టుకుంటున్న అన్నదాత ఒకవైపు అయితే.. గ్రామాల్లో అభివృద్ధి పను లు చేపట్టినా బిల్లులు రాక అవస్థలు పడుతున్న మాజీ సర్పంచ్‌లు మరోవైపు .. వేతనాలందక జీపీ కార్మికులు.. వేతనాలు పెంచాలని ఆశ వర్కర్ల నిరసనలు.. డీఏలు అందక ఉపాధ్యాయ, ఉద్యోగులు, రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్ రాక ఎదురుచూస్తున్న ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రాక విద్యార్థుల వెతలు.. స్వయం సహా య సంఘాలకు రుణాలు రాక మహిళలు.. వీరితోపాటు అనేక వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీం తో ఉగాది పండుగను ఏలా చేసుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పు టడూ ఇలాంటి పరిస్థితి రాలేదని పేర్కొంటున్నారు.
-షాబాద్, మార్చి 29
అన్నదాత అరిగోస..
ఆరుగాలం కష్టపడి పంటలు పండించే అన్నదాత అరిగోస పడుతున్నాడు. అడుగంటుతున్న భూగర్భ జలాలతో బోరుబావుల్లో చుక్క నీరు లేకుండా పోతున్నది. దీంతో వాటి కింద సాగు చేసి న పంటలు కండ్ల ముందే ఎండిపోతుంటే రైతన్న కన్నీరుము న్నీరు అవుతున్నాడు. గత కేసీఆర్ హయాంలో మిషన్ కాకతీయ పథకం ద్వారా ఏండ్ల తరబడి మరమ్మతులకు నోచుకోని చెరువులను పూడిక తీయడంతో భారీ వర్షాలకు చెరువులు నిం డి అలుగులు పారాయి. దీంతో బోరుబావుల్లో నీరు పుష్కలంగా ఉండడంతో అన్నదాతలు సంతోషంగా పంటలు పండించుకున్నారు.
కానీ, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ చెరువులు, కాల్వలను పట్టించుకోవడం లేదు. చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టకపోవడంతో అవి నీరు లేక ఎండిపోతున్నాయి. తద్వారా బోరుబావుల్లో నీటిమట్టం తగ్గిపోయి అన్నదాతలు వేసిన పంట లు ఎండిపోతున్నాయి. అంతేకాకుండా రైతుభరోసా పెట్టుబడి సాయం అందక కొందరు.. రుణమాఫీ కాక మరికొంతమంది రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రతి ఏడాది ఉగాది పండుగకు రైతులు కొత్త అరకలను తయారు చేసి పూజలు చేసి వ్యవసాయ పనులు ప్రారంభించేవారు. ఈ ఏడాది రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారడంతో ఆ ఉత్సాహం ఎక్కడా కనిపించడం లేదు.
ఆశ వర్కర్ల ఆశలు ఆవిరి
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ అమలు చేయకపోవడంతో ఆశ వర్కర్ల ఆశలు ఆవిరయ్యాయి. ఆశ వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పవర్లోకి రాగానే చేతులెత్తేయడంతో వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి. తమ సమస్యలు పరిష్కరించాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఏమైనా నిరసన కార్యక్రమాలు చేపడితే ప్రభుత్వం పోలీసులతో ఎక్కడికక్కడ అరెస్టులు చేయించి అడ్డుకుంటున్నదని మండిపడ్డారు.
రైతులకు అన్నీ కష్టాలే..
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంకా రైతులకు అన్నీ కష్టాలే మొదలయ్యాయి. భూగర్భజలాలు అడుగంటడంతో బోరుబావుల్లో నీరు లేకుండాపోయి.. వేసిన పంటలన్నీ ఎండిపోతున్నాయి. ఆరుగా లం కష్టపడి సాగు చేసిన పంటలు కండ్ల ముందే ఎండిపోతుంటే కన్నీళ్లు వస్తున్నాయి. ప్రభుత్వం రైతుభరోసా పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేయకున్నా.. అప్పులు తీసుకొచ్చి పంటలు సాగు చేశారు. కేసీఆర్ హయాంలోనే అన్నదాతలు సంతోషంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు కష్టాలే..
-కుమార్‌యాదవ్, రైతు కుమ్మరిగూడ, షాబాద్ మండలం
జీతాలు రాకుంటే పండుగెట్ల చేసుకునేది..
గత నాలుగు నెలలుగా జీతాలే రావడం లేదు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారింది. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం ఉండడం లేదు. ఈ ప్రభుత్వం లో పంచాయతీ కార్మికుల బతుకులు రోజురోజుకూ దిగజారు తున్నాయి. బతకడమే భారంగా మారగా.. పండుగను ఎలా జరుపుకోవాలి.
-గడ్డమీది లక్ష్మయ్య, జీపీ కార్మికుడు, తాళ్లపల్లి, షాబాద్
సమస్యల పరిష్కారంలో విఫలం
అధికారంలోకి రాక ముందు అనేక హామీలిచ్చి.. గద్దెనెక్కగానే వాటిని అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. గ్రామ పంచాయతీ కార్మికులు వేతనాలందక ఇబ్బందులు పడుతున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆశ వర్కర్లు కోరుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని ధర్నాలకు దిగితే ఎక్కడిక్కడ పోలీసులతో ప్రభుత్వం అరెస్టులు చేయించడం దారుణం. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులు సంతోషంగా పండుగను ఎలా జరుపుకొంటారు. ప్రస్తుతం పండుగకు పస్తుంలుండాల్సిన పరిస్థితే నెలకొన్నది. ప్రభుత్వం వెంటనే స్పందించి జీపీ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించాలి.
-అల్లి దేవేందర్, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి
బిల్లులు రాక తిప్పలు..
గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు ఇంకా రాకపోవ డంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నా. గ్రామంలో రూ. 20 లక్షలతో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీతోపాటు పలు పనులను చేపట్టా. రెండేండ్లు దాటుతున్నా ఇప్పటికీ డబ్బులు రాలేదు. అధికారులను అడిగితే మా చేతుల్లో ఏమి లేదని చెబుతున్నారు. అప్పులు చేసి పనులు చేపట్టగా.. వాటికి వడ్డీలు చెల్లించలేని పరిస్థితి నెలకొన్నది. మమ్మల్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
-కుమ్మరి దర్శన్, మాజీ సర్పంచ్ సంకెపల్లిగూడ, షాబాద్
నాలుగు నెలలుగా అందని జీతాలు
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే పంచాయతీ కార్మికులకు కొన్ని నెలలుగా జీతాలు రాకపోవడంతో వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం గ్రామాలను స్వచ్ఛం గా మార్చేందుకు పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందుకోసం గ్రామా ల్లో పంచాయతీ సిబ్బందిని నియమించింది. అప్పట్లో వా రికి ప్రతినెలా సక్రమంగా జీతాలు అందడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండే. కానీ, ప్రస్తుత రేవంత్ సర్కార్‌లో గత నాలుగు నెలలుగా జీతాలు అందక పూట గడవడమే కష్టంగా మా రిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పండుగకూ పస్తులుండాల్సిన పరిస్థితే వచ్చిందని వాపోతున్నారు.