Udhayanidhi Stalin | తమిళనాడు (Tamil Nadu)లో రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమిళ స్టార్ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ (Vijay)పై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) తీవ్ర విమర్శలు చేశారు. తానేమీ ఇతర నేతల్లా వారాంతపు రాజకీయ నాయకుడిని కాదంటూ విజయ్‌ని ఉద్దేశిస్తూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
కాగా, విజయ్ ప్రతి శనివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను వారంలో దాదాపు ఐదు రోజులు అధికారిక పర్యటనలతో బిజీగా ఉంటాను. ఆదివారాల్లో కూడా పర్యటిస్తాను. కొందరిలా శనివారాల్లో మాత్రమే బయటకు వచ్చే నాయకుడిని కాదు. ఆదివారాల్లో కూడా ప్రయాణిస్తూనే ఉంటాను. నేను వారంలో ఏ రోజు అని చూడను. ఈ రోజు ఏ రోజు అనేది నాకు తెలియదు’ అంటూ చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలు విజయ్‌ని ఉద్దేశించే అని తెలుస్తోంది. ఉదయనిధి వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి.
విజయ్ (Thalapathy Vijay) గతేడాది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం పార్టీ (TVK Party)ని స్థాపించారు. 2026 జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు అప్పట్లోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్ ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నారు. ఇక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రచారాన్ని ముమ్మురం చేశారు విజయ్. రాష్ట్రవ్యాప్తంగా వారాంతాల్లో బహిరంగ సభలు, ప్రచార కార్యక్రమాలకు హాజరవుతున్నారు.
Also Read..
Petal Gahlot | ఐరాస వేదికగా పాక్ ప్రధానికి గట్టిగా బదులిచ్చిన పేటల్ గహ్లోత్.. ఇంతకీ ఎవరీమె..?
Donald Trump | హెలికాప్టర్లో ట్రంప్ దంపతులు గొడవ..? వీడియో వైరల్