న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్కు చెందిన స్వదేశీ 4జీ నెట్వర్క్ను ప్రధాని మోదీ(PM Modi) ఇవాళ ప్రారంభించారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన టెలికాం పరికరాలతో 4జీ సేవలను అందించనున్నారు. బీఎస్ఎన్ఎల్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల నేపథ్యంలో మోదీ స్వదేశీ 4జీ సేవల్ని ప్రారంభించారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్క చెందిన 97,500 మొబైల్ 4జీ టవర్లను ఆయన ప్రారంభించారు. దీంట్లో 92,600 4జీ టెక్నాలజీ సైట్లు ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీతో .. స్వదేశీ స్పూర్తి బలోపేతం అవుతుందని మోదీ అన్నారు. 92 వేల సైట్ల ద్వారా సుమారు 22 మిలియన్ల భారతీయుల్ని కనెక్ట్ కానున్నారు.
దేశీయ టెలికాం రంగంలో ఇది కీలకమైన మైలురాయి కానున్నది. ఒడిశాలోని జార్సుగూడలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ బీఎస్ఎన్ఎల్ 4జీ టవర్లను ఓపెన్ చేశారు. ఒడిశా, ఏపీ, యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్, అస్సాం, గుజరాత్, బీహార్ రాష్ట్రాల్లో బీఎస్ఎన్ఎల్ టవర్లను ఏర్పాటు చేశారు. ఒడిశాలో సుమారు 60 వేల కోట్లకు చెందిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
When technology is indigenous, progress is inclusive.
BSNL’s rollout of 4G — powered by Indian companies — is a giant leap for Digital India.#25YearsOfBSNL #BSNL #Swadeshi4G #BSNL4GSaturation #BharatKaApna4G #ConnectingTheUnconnected #DigitalIndia #ConnectivityForAll…
— BSNL India (@BSNLCorporate) September 27, 2025