న్యూఢిల్లీ : భారత్తో పాటు ఐదు దేశాల ప్రయాణికులపై ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయనున్నట్లు యూఏఈ నేషనల్ ఎమర్జెన్సీ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్ (NCEMA) తెలిపింది. ఆంక్షలు అమలులో ఉన్నప్పటికీ చెల్లుబాటయ్యే రెసిడెన్సీ వీసాలు, యూఏఈలో చెల్లుబాటయ్యే టీకా రెండు డోసులు తీసుకున్న వారికి నిషేధం నుంచి మినహాయింపును ఇచ్చింది. ఆ దేశంలో పని చేసే వైద్యులు, సాంకేతిక నిపుణులు, యూనివర్సిటీలు, కాలేజీలు, పాఠశాలలు, ఇన్స్టిట్యూట్లలో బోధించే వారికి షరతులు లేకుండా ఆ దేశంలో ప్రవేశానికి అనుమతి ఇచ్చింది. అయితే, ప్రయాణానికి ముందు ఆన్లైన్ ఎంట్రీ పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా.. ప్రయాణానికి 48 గంటల ముందు తీసుకున్న కొవిడ్-19 నెగెటివ్ ఆర్టీ పీసీఆర్ పరీక్ష సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ప్రయాణ సమయంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ప్రయాణికుల అనుమతించనున్న దేశాల్లో భారత్తో పాటు పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, నైజీరియా, ఉగాండా ఉన్నాయి.
#NCEMA and Civil Aviation: Entry to the UAE will be allowed for some categories of passengers from countries, from where inbound flights to the Emirates have been banned. #TogetherWeRecover https://t.co/uvqhZXyKLy pic.twitter.com/I5cgoDbrrC
— NCEMA UAE (@NCEMAUAE) August 3, 2021