నిర్మల్ : జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుంటాల మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మండలంలో 20 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. భారీ వర్షాలకు వెంకూరు చెరువు కట్ట తెగిపోయింది. చెరువు నీరంతా వాగులోకి ప్రవహిస్తున్నది. వాగులో ఇద్దరు గ్రామస్తులు చిక్కుకుపోయారు. అయితే, వారి పూర్తి వివరాలు తెలియరాలేదు. వారిని రక్షించేందుకు గ్రామస్తులు ప్రయత్నాలు చేస్తున్నారు. నీటి ప్రవాహంతో పలు గ్రామాల నుంచి కుంటాలకు రాకపోకలు నిలిచిపోయాయి.