బ్రౌన్ యూనివర్సిటీ: అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో శనివారం ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారు. యూనివర్సిటీలోని ఇంజినీరింగ్, భౌతిక శాస్త్ర విభాగాల తుది పరీక్షల రెండో రోజు ఈ ఘటన జరిగింది. నిందితుడిని ఇంకా గుర్తించ లేదు. అతడు నలుపు దుస్తులు ధరించిన 30 ఏండ్ల వ్యక్తి అని అనుమానిస్తున్నారు. యూనివర్సిటీ క్యాంపస్లో అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. దేశ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ట్రంప్, వాన్స్ కాల్పుల ఘటనను ఖండించారు. స్థానిక పోలీసులకు దర్యాప్తులో ఎఫ్బీఐ సాయం చేస్తుందని చెప్పారు. సురక్షితమని ప్రకటించే వరకు యూనివర్సిటీ సమీపంలో నివసించేవారు ఇండ్ల లోపలే ఉండాలని ప్రొవిడెన్స్ మేయర్ బ్రెట్ స్మైలీ విజ్ఞప్తి చేశారు.