గట్టుప్పల్, డిసెంబర్ 19 : పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేనావత్ వాల్య, నేనావత్ దశరథను బీఆర్ఎస్ గట్టుప్పల్ మండలం అంతంపేట గ్రామ శాఖ అధ్యక్షుడు ఐతరాజు హనుమంతు పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ గ్రామ శాఖ కమిటీ మొత్తం ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పార్టీ కట్టుబాట్లను లెక్కచేయకుండా ఉప సర్పంచ్ ఎన్నిక విషయంలో ఇతర పార్టీలకు వత్తాసు పలకడం లాంటి కార్యకలాపాలకు పాల్పడడంతో సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిపారు. ఎంతటి వారైనా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.