Skin Itching | మన శరీరంలోని అతి పెద్ద అవయవాలల్లో చర్మం ఒకటి. అంతర్గత అవయవాలతో పాటు బాహ్య శరీరాన్ని కాపాడడంలో చర్మం ముఖ్యపాత్ర పోషిస్తుంది. శరీరంలోని ఇతర అవయవాల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో అలాగే చర్మ ఆరోగ్యం గురించి కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. కానీ మనలో చాలా మంది దురద సమస్యతో బాధపడుతుంటారు. చంకలు, పిరుదులు, తొడల వంటి శరీర భాగాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. దురద వల్ల కలిగే బాధ అంతా కాదు. వ్యాయామం ఎక్కువగా చేయడం, బిగుతైన దుస్తులను ధరించడం, తడిగా ఉన్న దుస్తులను ధరించడం, అధికబరువు వంటి కారణాల వల్ల దురద ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దురద కారణంగా చర్మం పొడిబారడంతోపాటు చర్మ సౌందర్యం కూడా తగ్గుతుంది. చర్మంపై వచ్చే దురదను మనం కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగించి సహజ సిద్దంగా తగ్గించుకోవచ్చు.
ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల వంటసోడాను తీసుకుని అందులో కొద్దిగా నీటిని వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను దురద ఉన్న చోట రాసి సున్నితంగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల దురద తగ్గుతుంది. వంటసోడాలో ఉండే ఆల్కలీన్ లక్షణాలు దురదను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే కలబంద ఆకుల నుండి గుజ్జును తీసి జెల్ లాగా చేసుకోవాలి. దీనిని దురద ఉన్న చోట రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కలబంద గుజ్జు అందుబాటులో లేనివారు మార్కెట్ లో లభించే కలబంద జెల్ ను కూడా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా మార్కెట్ లో మనకు అనేక రకాల పెట్రోలియం జెల్లీలు అందుబాటులో ఉన్నాయి. దురదను తగ్గించడంలో ఇవి కూడా మనకు సహాయపడతాయి. స్నానం చేసిన తరువాత దురద ఉన్న చోట పెట్రోలియం జెల్లీని రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా దురద తగ్గుతుంది.
దురదను తగ్గించడంలో నెయ్యి కూడా ప్రభావవంతంగా పని చేస్తుంది. దురద ఉన్న చోట చర్మంపై రోజుకు రెండు సార్లు నెయ్యిని రాయాలి. ఇలా చేయడం వల్ల దురదతో పాటు మంట, ఎరుపుదనం కూడా తగ్గుతాయి. అలాగే దురదను తగ్గించడంలో కొబ్బరి నూనె ప్రభావవంతంగా పని చేస్తుంది. కొబ్బరి నూనెను రాయడం వల్ల దురద తగ్గడంతోపాటు చర్మం సున్నితంగా తయారవుతుంది.
ఈ క్రీమ్ ను బంతిపువ్వుల నుండి తయారు చేస్తారు. దీనిలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. దురద ఉన్న చోట చర్మంపై ఈ క్రీమ్ ను రాసుకోవడం వల్ల దురద నుండి చక్కని ఉపశమనం కలుగుతుంది.