Navi Mumbai | మహారాష్ట్రలో భారీ వర్షాలు.. నవీ ముంబై డ్యామ్ కాంప్లెక్స్‌లో పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతు
Navi Mumbai | వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో నవీ ముంబైలోని (Navi Mumbai) పన్వెల్‌లో గల గడేశ్వర్ డ్యామ్ కాంప్లెక్స్‌లో ఆదివారం నీటిలోకి దిగిన ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు.
ముంబై : మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు(Heavy rains) కురుస్తున్నాయి. రాజధాని ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదల్లో ఇప్పటికే నలుగురు మృతి చెందారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో నవీ ముంబైలోని (Navi Mumbai) పన్వెల్‌లో గల గడేశ్వర్ డ్యామ్ కాంప్లెక్స్‌లో ఆదివారం నీటిలోకి దిగిన ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు వారిని కర్ర సాయంతో రక్షించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇప్పటివరకు ఒక వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీశారు.
మరొకరి కోసం స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. డ్యామ్‌లో కొట్టుకు పోతు న్న సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు వైరల్‌గా మారాయి. మరో ఘటనలో సోమవారం థానేలోని వాగ్లే ఎస్టేట్‌లోని హుజూరి ప్రాంతంలోని రవాణా కార్యాలయం ముందు చెట్టు కొమ్మ విరిగిపడటంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయప డ్డాడు. క్షతగాత్రుడిని వెంటనే చికిత్స కోసం సమీపంలోని ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు. ముంబై, దాని పొరుగు జిల్లాలైన థానే, రాయగఢ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) తెలిపింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
అత్యవసరమైతే తప్పా ప్రజలు ఎవరు కూడా బయటకు రావొద్దని అధికారులు సూచించారు. కాగా, భారీ వర్షాల కారణంగా పుణె జిల్లాలో కొండచరియలు(Landslide collapses) విరిగిపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. మావల్ తాలూకాలోని పటాన్ గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచా రం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు, అగ్నిమాపక దళం ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

