కోల్‌కతా, జనవరి 12: నిపా వైరస్‌గా అనుమానిస్తున్న రెండు కేసులను పశ్చిమ బెంగాల్‌లోని ఎయిమ్స్ కళ్యాణిలోగల ఐసీఎంఆర్ వైరస్ రిసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ లాబొరేటరీలో ఆదివారం గుర్తించినట్లు అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి. వేగంగా విస్తరించే, అధిక మరణాలకు దారితీసే నిపా వైరస్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పరిస్థితికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు వారు చెప్పారు.
ఇందులో ఓ కేసు భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలోని నాడియా జిల్లాలోని ఘుగ్రగచ్చికి ప్రయాణించినట్లు తెలిసిందని వారు చెప్పారు. ఇతరులకు వైరస్ సోకకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సాయపడేందుకు జాతీయ సంయుక్త విపత్తు నిర్వహణ బృందాన్ని బెంగాల్‌కు పంపుతున్నట్లు కేంద్రం తెలిపింది.