భోపాల్: భార్య కలను సాకారం చేసిన భర్తకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తనకు పోలీసు శాఖలో ఉద్యోగం చేయాలనే కోరిక ఉందని ఆ యువతి పెండ్లికి ముందే తన కాబోయే భర్తకు చెప్పింది. అందుకు ఆయన అంగీకరించారు. వృత్తి రీత్యా పూజారి అయిన భర్త పగలు, రాత్రి శ్రమించి, తన భార్య పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం సాధించేలా సహాయపడ్డారు.
ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్న భార్యకు తన భర్త ధరించే వస్ర్తాలు, శిఖ, సంప్రదాయ పద్ధతులు నచ్చలేదు. వీటిని మార్చుకోవాలని ఆమె తన భర్తకు అనేకసార్లు చెప్పింది. కానీ ఆయన ససేమిరా అన్నారు. దీంతో విడాకుల కోసం దరఖాస్తు చేసింది. భోపాల్ కుటుంబ న్యాయస్థానంలో వీరి విడాకుల పిటిషన్ విచారణలో ఉంది. అనేకసార్లు కౌన్సెలింగ్ చేసినప్పటికీ ఆమె తన అభిప్రాయాన్ని మార్చుకోవడం లేదు.