హైదరాబాద్ : తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఝార్కండ్, బిహార్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతున్నదని పేర్కొంది. సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉందని చెప్పింది. దీంతో గురు, శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం పలు చోట్ల మోస్తరు వర్షాలు పడుతాయని, పలు జిల్లాల్లో భారీ వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.