తెలంగాణకు రెండు రోజుల వర్ష సూచన
తెలంగాణకు రెండు రోజుల వర్ష సూచన | తెలంగాణ వ్యాప్తంగా ఆది, సోమవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఆది, సోమవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రాంతాల మీదుగా కొనసాగుతుందని పేర్కొంది.
దీనికి అనుబంధంగా.. మధ్య ట్రోపోస్ఫియర్ స్థాయి వరకు ఉపరితల ఆవర్తనం వ్యాపించినట్లు చెప్పింది. రానున్న రోజుల్లో మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఒడిశా, జార్ఖండ్,ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా వెళ్లే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ఉత్తర పశ్చిమ ద్రోణి, అల్పపీడన ప్రాంతం నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్, విదర్భ, ఉత్తర, మధ్య మహారాష్ట్ర మీదుగా అరేబియా సముద్రం వరకు 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడినట్లు పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
కొవిడ్-19 నుంచి రక్షణకు ఎస్బీఐ పర్సనల్ ‘కవచ్’
పులిట్జర్ అవార్డును గెలుచుకున్న భారత సంతతి జర్నలిస్టు
కరోనా వ్యాక్సినేషన్లో భారత్ మరో మైలురాయి
కరోనా మరణాలపై డెత్ ఆడిట్ నిర్వహించాలి : ఎయిమ్స్ డైరెక్టర్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

