కరోనా మరణాలపై డెత్ ఆడిట్ నిర్వహించాలి : ఎయిమ్స్ డైరెక్టర్
కరోనా మరణాలపై డెత్ ఆడిట్ నిర్వహించాలి : ఎయిమ్స్ డైరెక్టర్ |

న్యూఢిల్లీ : దేశంలో సంభవించిన కొవిడ్ మరణాలపై డెత్ ఆడిట్ నిర్వహించాలని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా సూచించారు. మహమ్మారిపై పోరాడేందుకు వ్యూహాలను రూపొందించడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాల్లో ఆసుపత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా సంబంధిత మరణాలను తప్పుగా చూపడం సహాయపడదని, ఆటంకం ఏర్పడుతుందన్నారు. పలు రాష్ట్రాలు కొవిడ్ మరణాలను తక్కువగా చూపిస్తున్నాయన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి ఇటీవల మధ్యప్రదేశ్‌లో అధికారిక గణాంకాలు, ఏప్రిల్‌లో నిర్వహించిన చివరి కర్మల సంఖ్య మధ్య అసమానత ఉండడమే కారణం.
‘ఒక వ్యక్తికి అప్పటికే కరోనా ఉండి గుండెపోటుతో చనిపోతే అప్పుడు కొవిడ్ గుండెపోటుకు కారణం కావచ్చు. మీరు దీన్ని కొవిడ్ మరణమని లేదా నాన్ కొవిడ్‌గా గుర్తించి గుండెపోటుతో మరణించారని అని తప్పుగా వర్గీకరించవచ్చు.. కాబట్టి, అన్ని ఆస్పత్రులు, రాష్ట్రాలు డెత్ ఆడిట్ చేయవలసిన అవసరం ఉంది. ‘అన్ని ఆసుపత్రులు, రాష్ట్రాలు డెత్ ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరణాలకు కారణాలు ఏంటీ? మన మరణాల రేటును తగ్గించేందుకు ఏం చేయవచ్చో మనం తెలుసుకోవాలి. మాకు స్పష్టమైన డేటా లేకపోతే.. మేము చేయలేము మా మరణాలను తగ్గించడానికి ఒక వ్యూహాన్ని అభివృద్ధి చేయగలగాలి’ అని అన్నారు.
కొవిడ్ రోగి మరణించాడా ? లేదా? అనే విషయాన్ని ఎవరు నిర్ణయించాలో ఇటీవల కేరళ శాసనసభ ఇటీవల చర్చించిన నేపథ్యంలో ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్ల మధ్య అంతరంపై ఆయన స్పందిస్తూ ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్‌పై ఇంకా అధ్యయనం కొనసాగుతుందున్నారు. వైద్య సంఘం ప్రస్తుత అవగాహన ప్రకారం.. 12-13 వారాల సమయం ‘సరిపోతుంది’, కొత్త డేటా అందుబాటులోకి వస్తే మార్పులు చోటు చేసుకోవచ్చన్నారు.
ఇవి కూడా చదవండి..
కొవిడ్-19 నుంచి రక్షణకు ఎస్బీఐ పర్సనల్ ‘కవచ్’
పులిట్జర్ అవార్డును గెలుచుకున్న భారత సంతతి జర్నలిస్టు
కరోనా వ్యాక్సినేషన్లో భారత్ మరో మైలురాయి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

