Good News : పిల్లలపై రెండు టీకాలు ప్రభావవంతం
Good News : పిల్లలపై రెండు టీకాలు ప్రభావవంతం | కరోనా మహమ్మారి థర్డ్ వేవ్‌లో పిల్లలపై ప్రభావం చూపుతుందనే హెచ్చరికల మధ్య రెండు టీకా కంపెనీలు శుభవార్త చెప్పాయి.

కరోనా మహమ్మారి థర్డ్‌వేవ్‌లో పిల్లలపై ప్రభావం చూపుతుందనే హెచ్చరికల మధ్య నిపుణులు శుభవార్త చెప్పారు. ప్రస్తుతం తయారీలో ఉన్న రెండు టీకాలు ట్రయల్స్ అద్భుతమైన ఫలితాలు చూపించాయని పేర్కొంటున్నారు. మెడెర్నాతో పాటు ప్రోటీన్-ఆధారిత ప్రయోగాత్మక టీకాలు పిల్లలకు.. కరోనా నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు తేలింది. ఈ మేరకు కోతి జాతికి చెందిన రీసస్ మకాక్ (ఆఫ్రికన్లాంగూర్) పిల్లలపై చేసిన ప్రయోగంలో యాంటీబాడీలు ప్రతిస్పందిస్తున్నట్లు నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన అంశాలను సైన్స్ ఇమ్యునాలజీ పత్రికలో ప్రచురించారు.
పిల్లల్లో వైరస్ వ్యాప్తిని నివారించడానికి టీకాలు కీలకమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ టీకాల ప్రయోగాలు.. 16 కోతి పిల్లలపై 22 వారాలపాటు జరిగాయని.. అయితే మరిన్ని విషయాలను అర్థం చేసుకోవడానికి ఏడాది పాటు ప్రయోగాలు కొనసాగిస్తున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు. రెండున్నర నెలల వయసున్న కోతి పిల్లలను రెండు గ్రూపులుగా విడదీసి.. టీకాలను ఇవ్వగా.. నాలుగు వారాల తర్వాత రోగనిరోధక శక్తి పెరిగినట్లు పరిశోధకులు తెలిపారు. ప్రతి జంతువుకు ప్రీక్లినికల్ మోడెర్నా, mRNA టీకా అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (ఎన్ఐఏఐడీ) అభివృద్ధి చేసిన ప్రోటీన్ ఆధారిత వ్యాక్సిన్ ఇచ్చారు. ఎంఆర్ఎన్ఏ టీకా వైరస్ ఉపరితల ప్రోటీన్, స్పైక్ ప్రోటీన్‌ను ఉత్పత్తి చేయడానికి శరీరానికి సూచనలను అందిస్తుంది.
వ్యాక్సిన్.. స్పైక్ ప్రోటీన్న్లను సృష్టించమని కణాలను నిర్దేశిస్తుంది. ఇది వైరస్.. మానవ శరీరంలోని అన్ని భాగాలకు ప్రవేశించడానికి ఉపయోగపడుతుంది. దీంతో రోగనిరోధక కణాలు ప్రోటీన్‌ను గుర్తించి యాంటీబాడీలను అభివృద్ధి చేస్తాయి. ఎన్ఐఏఐడీ టీకాలోనే స్పైక్ ప్రోటీన్ ఉంటుంది. దాన్ని రోగనిరోధక వ్యవస్థ గుర్తించి అదే పరిమాణంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. రెండు వ్యాక్సిన్లు ఇమ్యునోగ్లోబులిన్ జీని తటస్థీకరించి, కరోనా, స్పైక్ ప్రోటీన్-నిర్దిష్ట టీ కణాలకు వ్యతిరేకంగా యాంటీబాడీలు వృద్ధి అవుతాయని పరిశోధకులు తెలిపారు. అయితే వ్యాక్సిన్లు.. టీ హెల్పర్ టైప్ 2పై ఎలాంటి ప్రభావం చూపలేదని, ఇది పిల్లల్లో భద్రతకు హాని కలిగిస్తుందని.. అలాగే యాంటీబాడీలు ఎదుర్కొని.. చిన్నపిల్లల్లో టీకా అభివృద్ధికి ఆటంకం కలిస్తాయి.
కాబట్టి మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. అయితే పెద్దలకు ఇచ్చే 100 మైక్రోగ్రామ్ డోసుకు బదులుగా.. 30 మైక్రోగ్రాముల డోసు పిల్లలకు ఇచ్చినట్లయితే.. శక్తిమంతమైన ప్రతిరోధకాల వయోజనుల్లో పెరిగిన స్థాయితో పోల్చవచ్చు అని పరిశోధకుల్లో ఒకరైన అమెరికాలోని నార్త్ కరోలినా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ క్రిస్టినా డి పారిస్ తెలిపారు. మోడెర్నా టీకాతో, నిర్దిష్ట బలమైన టీ-కణాలు ప్రతిస్పందిస్తాయని.. ఇవి వ్యాధి తీవ్రతను ముఖ్యమైనవని ఆయన పేర్కొన్నారు. సురక్షితమైన, సమర్థమైన టీకాలు.. పిల్లల్లో కరోనా వ్యాప్తిని తగ్గించడంలో సహాయపడతాయని వివరించారు.
ఇవి కూడా చదవండి..
కరోనా నుంచి సర్దితో రక్షణ
ఇమ్యూనిటీ పెరగాలంటే
ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం
తెలంగాణకు రెండు రోజుల వర్ష సూచన
‘డెల్టా వేరియంట్‌పై కొవిషీల్డ్ 61శాతం సమర్థవంతం’
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

