ఇమ్యూనిటీ పెరగాలంటే

పెద్దలైనా, పిల్లలైనా వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉండాలి. అప్పుడే ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంటారు. అయితే, పసిపిల్లలకు ఇమ్యూన్ సెల్స్ తల్లి పాలద్వారా వస్తాయి. అలాగే, వయసుకు తగిన వ్యాక్సిన్లు వేయిస్తుంటే, చాలా రకాల ఇన్ఫెక్షన్లనుంచి పిల్లలను కాపాడుకోవచ్చు.
థర్డ్ వేవ్ భయపెడుతున్నది. చిన్న పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగాలంటే ఏం చేయాలి? -ఓ సోదరి
తల్లి పాలు :
తల్లి పాలలోని కొలోస్ట్రమ్ పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచుతుంది. పుట్టినప్పటి నుంచీ కనీసం ఆరు నెలలపాటు తల్లి పాలు తాగితే వాళ్ల రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటుందని ఎన్నో అధ్యయనాలు చెప్తున్నాయి.
జింక్ (ఇమ్యూనిటీ లించ్పిన్) :
ఖనిజ లవణాలన్నిటిలోకి జింక్ పిల్లల ఇమ్యూనిటీ సిస్టమ్‌పై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఇది బీన్స్, నట్స్ వంటి ప్రొటీన్ ఫుడ్స్‌లో పుష్కలం.
పండ్లు, కూరగాయలు :
తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ కణాలను పాడవకుండా కాపాడుతాయి. వ్యాధుల బారినుంచి రక్షిస్తాయి. బెర్రీస్, బ్రొకోలీ, పాలకూర, ఆవాల ఆకులు (మస్టర్డ్ లీవ్స్) మొదలైన వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి.
హెల్దీ గట్ :
గట్ హెల్త్ కూడా చాలా ముఖ్యం. జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుంటేనే ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరగాలన్నా, పేగు మార్గాలు దృఢంగా ఉండాలన్నా ప్రోబయాటిక్స్ పుష్కలంగా ఉండే ఆహారం పిల్లలకు ఇవ్వాలి. రోజూ పెరుగుతోపాటు ఒక పండు కచ్చితంగా పెట్టాలి. కొంచెం పెద్ద పిల్లలైతే పెరుగులో క్యారెట్, కీరా తరుగు వేసి ఇస్తే ఇష్టంగా తింటారు.
సరిపడా నిద్ర :
పిల్లలకు రోజూ 10నుంచి 14 గంటల నిద్ర అవసరం. అదికూడా మధ్యలో ఎలాంటి ఆటంకం లేకుండా ఉండాలి. రాత్రికి నిద్ర పుచ్చే ముందు గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేయించడం, లైట్‌గా మసాజ్ చేయడం, కొంతసేపు పుస్తకం చదివించడం వంటివి చేయాలి. సరిపడా నిద్రపోయే పిల్లలు అంత త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడరు.
యాంటీబయాటిక్స్ వద్దు :
యాంటీ బయాటిక్స్ త్వరగా పని చేస్తాయన్న మాట నిజమే. అయినా సరే, వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే, అవి శరీరంలోని మంచి బ్యాక్టీరియాను పూర్తిగా తొలగిస్తాయి. దానివల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.
మయూరి ఆవుల,
న్యూట్రిషనిస్ట్,
www.trudiet.in
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Children
- immunity
- Third Wave
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

