TVS Apache RTR 160 4V | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ (TVS Motors India) తన `టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ’ న్యూ లైటెనింగ్ బ్లూ ఎడిషన్ బైక్ ఆవిష్కరించింది. గోవాలో జరుగుతున్న భారత్ బైకింగ్ ఈవెంట్లో ఈ బైక్ ఆవిష్కరించింది. ఈ మోటారు సైకిల్.. బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 మోటారు సైకిల్‌తో పోటీ పడుతుంది.
వాయిస్ అసిస్ట్ ఫీచర్ తో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, డ్యుయల్ చానెల్ ఏబీఎస్ తోపాటు రేర్ డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉంటాయి. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ బైక్ లైటెనింగ్ బ్లూ ఎడిషన్ ధర రూ.1.35 లక్షలు (ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించింది. అప్డేటెడ్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ ధర రూ.1.24 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 4వీ బైక్ 160సీసీ సింగిల్ సిలిండర్, 4వాల్వ్ ఎయిర్/కూల్డ్ ఇంజిన్, 5-స్పీడ్ గేర్ బ్యాక్స్ తో వస్తున్నది. అర్బన్, రైన్, స్పోర్ట్ రైడింగ్ మోడ్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజిన్ 15.64 పీఎస్ విద్యుత్, 14.14 ఎన్ఎం టార్క్ ఆవిష్కరిస్తుంది. స్పోర్ట్ మోడ్ బైక్ ఇంజిన్ గరిష్టంగా 17.55 పీఎస్ విద్యుత్, 14.73 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. అర్బన్, రెయిన్ మోడ్ బైక్ గరిష్టంగా గంటకు 103 కి.మీ, స్పోర్ట్ మోడ్ మోటారు సైకిల్ 114 కి.మీ మైలేజీ ఇస్తుంది.