ఆయుర్వేదంలో జీవనామృతంగా పేరున్న తులసి ఒత్తిడిని తగ్గించడంలో అద్భుతమైన ఔషధమని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్లో ప్రచురించిన ఓ అధ్యయనం ఈ విషయాన్ని తేటతెల్లం చేసింది. ఔషధంగా మలిచిన తులసి రసం ఒత్తిడి హార్మోన్గా పేరున్న కార్టిసాల్ స్థాయులను 36శాతం వరకు తగ్గిస్తుందని తేలింది.
ఎనిమిది వారాలపాటు వంద మంది వ్యక్తులపై అధ్యయనం చేసిన పరిశోధకులు ఒత్తిడిలో ఉన్నవారికి తులసి గట్టి మేలు చేస్తుందని తేల్చారు. తులసి రసం తీసుకున్న వారిలో నిద్ర నాణ్యత పెరిగినట్టు గుర్తించారు. అలాగే వారిలో రక్తపోటు కూడా అదుపులో ఉందని చెబుతున్నారు.