కార్తీక దీపోత్సవానికి హాజరుకావాలని కర్ణాటక సీఎంకు టీటీడీ ఆహ్వానం..

తిరుమల: కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 22వ తేదీన బెంగుళూరులో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవానికి హాజరు కావాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను ఆహ్వానించారు. సోమవారం తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం కర్ణాటక సీఎంను సుబ్బారెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం టీటీడీ ధార్మిక కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 19న తిరుపతి, 22న బెంగుళూరు, 29న విశాఖపట్నం లో భారీ ఎత్తున కార్తీక దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు.
గో సంరక్షణ, గో ఆధారిత వ్యవసాయం పై టీటీడీ చేస్తున్న కృషిని చైర్మన్ సీఎంకు వివరించారు. టీటీడీ చేపట్టిన హిందూ ధార్మిక కార్యక్రమాలను కర్ణాటక సీఎం బొమ్మై అభినందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలకమండలి సభ్యులు శశిధర్, విశ్వనాథ రెడ్డి తో పాటు పలువురు కర్ణాటక మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

