హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఆర్టీసీలో పలువురు డిప్యూటీ సీఏవోలు, అకౌంట్స్ ఆఫీసర్లు, అసిస్టెంట్ మేనేజర్లను బదిలీ చేస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి ఆదేశాల మేరకు చీఫ్ పర్సనల్ మేనేజర్ ఆర్డర్లను విడుదల చేశారు. కరీంనగర్ జోన్ డిప్యూటీ సీఏవోగా ఉన్న పీ స్వప్నకుమారిని ఆన్రిక్వెస్ట్ మేరకు హెడ్ ఆఫీస్‌లోని డిప్యూటీ సీఏవో(స్టోర్స్) గా బదిలీ చేశారు.
ఉప్పల్ డిప్యూటీ సీఏవో గా ఉన్న యూ రామకృష్ణను హైదరాబాద్‌కు బదిలీ చేశారు. ఆ స్థానంలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ సీఏవో బీ తిరుపతమ్మను హైదరాబాద్‌కు పంపారు. హెడ్ ఆఫీసులో ఏవోగా ఉన్న ఆర్ లావణ్యను అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్‌లో కరీంనగర్ జోన్ అకౌంట్స్ ఆఫీసర్‌గా బదిలీ చేశారు. నిజామాబాద్ ఏవోగా ఉన్న బీ స్వరూపరాణిని గ్రేటర్ హైదరాబాద్ జోన్‌కు పంపారు.