TS Weather | తెలంగాణ రాగల నాలుగు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు పలు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వానలు పడుతాయని చెప్పింది.
బుధవారం నుంచి గురువారం వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో.. శుక్రవారం నుంచి శనివారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.