TS Polycet-2021 : పాలిసెట్ ఫలితాలు విడుదల
పాలిసెట్ ఫలితాలు విడుదల | తెలంగాణ పాలిసెట్-2021 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి కన్వీనర్ బుధవారం శ్రీనాథ్ విడుదల చేశారు.

హైదరాబాద్ : తెలంగాణ పాలిసెట్-2021 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి కన్వీనర్ శ్రీనాథ్ బుధవారం విడుదల చేశారు. ఎంపీసీ విభాగంలో 81.75 శాతం ఉత్తీర్ణత, బైపీసీ విభాగంలో 76.42శాతం ఉత్తీర్ణత నమోదైందని కన్వీనర్ పేర్కొన్నారు. విద్యార్థులు https://polycetts.nic.in, sbtet.telangana.gov.in, dtets.cgg.gov.inలో ఫలితాలు చూసుకోవచ్చని చెప్పారు. ఈ నెల 17న పరీక్ష జరగ్గా.. 1,02,496 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 411 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు ఈ సంవత్సరం 92,557 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల నేపథ్యంలో మంగళవారమే కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది.
ఆగస్టు 5వ తేదీ నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. 5 నుంచి 9 వరకు రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్, 6వ నుంచి 10 వరకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కొనసాగనుంది. 6వ నుంచి 12 వరకు వెబ్ ఆప్షన్స్ కేటాయింపు, 14న మొదటి విడత సీట్ల కేటాయింపు.. 23 నుంచి తుది విడుత కౌన్సెలింగ్ జరుగనుంది. 24న తుది విడుత ధ్రువీకరణపత్రాలను పరిశీలించనున్నారు. 24, 25 తేదీల్లో తుది విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం, 27న తుది విడత సీట్ల కేటాయింపు జరుగనుంది. సెప్టెంబర్ 1 నుంచి పాలిటెక్నిక్ విద్యా సంవత్సరం ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్ 9న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.
ఇవి కూడా చదవండి..
ఆ దేశాలకు వెళ్తే మూడేళ్ల నిషేధం.. పౌరులకు సౌదీ హెచ్చరిక
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది దుర్మరణం
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. నేడు గేట్ల ఎత్తివేత
బ్రెజిల్లో ‘కొవాగ్జిన్’ అత్యవసర వినియోగ అనుమతి రద్దు!
Vaccine for children : కోవోవాక్స్ క్లినికల్ ట్రయల్స్‌కు నిపుణుల కమిటీ సిఫారసు
Corona Reinfection : ముంబై వైద్యురాలికి 13 నెలల్లో.. మూడుసార్లు కరోనా పాజిటివ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

