బోనకల్లు/మధిర, మార్చి 12: తాను టీఆర్ఎస్ రెబల్ను కాదని, ఎప్పటికీ పార్టీ విధేయుడినేనని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఆయన ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ బలోపేతానికి అనుక్షణం పనిచేస్తానని తెలిపారు. పార్టీ అధిష్ఠానం, ప్రజల అభీష్టం మేరకు ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టంచేశారు. పార్టీ నిర్ణయాన్ని ప్రతి కార్యకర్త శిరసావహించాలని సూచించారు. పార్టీల లక్ష్యాల మేరకు కార్యకర్తలు పనిచేయాలని కోరారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తాను పార్టీకి ఏనాడూ ద్రోహం చేయలేదని చెప్పారు.