బీజేపీ తాటాకు చప్పుళ్లకు టీఆర్ఎస్ భయపడదు
- భౌతిక దాడులు చేస్తామంటే సహించం
- కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దు : సమావేశంలో పి.కార్తీక్ రెడ్డి

బడంగ్‌పేట, డిసెంబర్ 29 : బీజేపీ తాటాకు చప్పుళ్లకు టీఆర్ఎస్ భయపడే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పటోళ్ల కార్తీక్‌రెడ్డి అన్నారు. వెంకటాద్రి కాలనీలో నివాసం ఉంటున్న మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ 13 వ డివిజన్ కార్పొరేటర్ నరేంద్ర కుమార్(నందు)ను బుధవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరాడన్ననెపంతో నందు ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రతీకారదాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. దౌర్జన్యం చేయడం మానుకోవాలని సూచించారు.
మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లో టీఆర్ఎస్కి సంపూర్ణ మద్దతు ఉన్న తర్వాత ప్రలోభపెట్టి బీజేపీ కార్పొరేటర్‌ను టీఆర్ఎస్లో చేర్చుకోవలసిన అవసరం లేదన్నారు. అభివృద్ధిని చూసే నరేంద్రకుమార్ టీఆర్ఎస్లో చేరారన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలను పడగొట్టడమే పనిగా మారిందని అన్నారు. మహేశ్వరం నియోజక వర్గంలోని కందుకూరు ఎంపీపీ పదవి కాంగ్రెస్‌తో కలిసి ఎన్నుకున్నది వాస్తవం కాదా? అని ఆయన నిలదీశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ, నిరుద్యోగుల కోసం దొంగ దీక్షలు చేస్తున్నారన్నారు.
అభివృద్ధి చూసే టీఆర్ఎస్లోకి.. : కార్పొరేటర్ నందుకుమార్
టీఆర్ఎస్లో చేరాలని ఎవరూ ఒత్తిడి చేయలేదని, స్వచ్ఛందంగా చేరానని 13వ డివిజన్ కార్పొరేటర్ నందకుమార్ తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి టీఆర్ఎస్లో చేరానన్నారు. కార్యక్రమంలో మీర్‌పేట డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్‌రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ చిగిరింత నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మీర్‌పేట అధ్యక్షుడు అర్కల కామేశ్‌రెడ్డి, ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్‌రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, దీప్లాల్ చౌహన్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

