టీఆర్ఎస్ 20 ఏండ్ల ప్రస్థానం గర్వకారణం..
బీజేపీ, కాంగ్రెస్ అబద్దాలను తిప్పికొట్టాలి.. రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి వేముల

వేల్పూర్ : టీఆర్ఎస్ ఇరవై ఏండ్ల ప్రస్థానం ప్రతి కార్యకర్తకు గర్వ కారణమని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో బాల్కొండ నియోజక వర్గంలోని ఎనిమిది మండలాల నూతన కార్యవర్గాలను ఆయన ప్రకటించారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ అబద్దపు ప్రచారాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు కావడం లేదని నిలదీసి ప్రశ్నించాలని సూచించారు. అక్రమ సొమ్ముతోఎదిగి, నకిలీ బాండ్ పేపర్తో రైతులను మోసం చేసిన అర్వింద్ తనను విమర్శించడం విడ్డూరంగా ఉందని అన్నారు.
ఇన్ని రోజులు ఓపిక పట్టినా..ఇక సహించేది లేదని హెచ్చరించారు. రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత, నాణ్యమైన కరెంటు, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, ఆసరా పెన్షన్ లాంటి సంక్షేమ కార్యక్రమాలు దేశంలో అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. తెలంగాణ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ద్వారా 39 వేల ఉద్యోగాలు, ఇతర ప్రభుత్వ శాఖలతో కలుపుకొని మొత్తం లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని వివరించారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మధుశేఖర్, ఎంపీపీలు శ్రీనివాస్, ఆర్మూర్ మహేశ్, జమున, లావణ్య, సామ పద్మ, సుకన్య, లోలం గౌతమి, జడ్పీటీసీలు అల్లకొండ భారతి, పార్టీ మండల కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

