మంచిర్యాల : సీఎం కేసీఆర్ బర్త్డే వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని టీఆర్ఎస్ శ్రేణులు ఆలయాల్లో పూజలు చేశారు. రక్తదాన, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. అలాగే వివిధ దేశాల్లోని తెలంగాణ ఎన్నారైలు బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో 68 కిలోల భారీ కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్య లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు నల్లాల ఓదెలు, గడ్డం అరవింద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.