రాష్ట్ర బాస్కెట్‌బాల్ జట్టుకు సన్మానం
హైదరాబాద్, ఆట ప్రతినిధి: కేరళలో ఇటీవల జరిగిన జాతీయ సీనియర్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచిన రాష్ట్ర మహిళల జట్టును ఘనంగా సన్మానించారు. టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న అమ్మాయిలను రాష్ట్ర బాస్కెట్‌బాల్ అసోసియేషన్(టీబీఏ) చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్రంలో బాస్కెట్‌బాల్‌కు ఎంతో భవిష్యత్ ఉంది. ప్రభుత్వ సహకారంతో బాస్కెట్‌బాల్ ఆటను మరింత అభివృద్ధి చేస్తాం. సీఎం కేసీఆర్ క్రీడలకు ఎంతో ప్రాధాన్యమిస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇండోర్ స్టేడియాలు నిర్మిస్తున్నాం. రానున్న జాతీయ స్థాయి టోర్నీలో తెలంగాణ జట్టు చాంపియన్‌గా నిలిచేటట్లు ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీబీఏ ప్రధాన కార్యదర్శి నార్మన్ ఇసాక్, ఉపాధ్యక్షుడు దిలీప్ అబ్రహం, కోచ్‌లు, ప్లేయర్లు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

