భోపాల్, సెప్టెంబర్ 17: మధ్యప్రదేశ్ పన్నా జిల్లాలోని గని ప్రాంతంలో ఒక గిరిజన మహిళకు అత్యంత ఖరీదైన మూడు వజ్రాలు దొరికాయి. 1.48 క్యారెట్, 20, 7 సెంట్ల బరువున్న మూడు వజ్రాలను వేలం వేస్తామని, అప్పుడు వాటి ధర ఏంటన్నది తెలుస్తుందని పన్నా జిల్లా ప్రభుత్వ అధికారి అనుపమ్ సింగ్ మంగళవారం మీడియాకు తెలిపారు. ‘మూడు వజ్రాల్లో ఒకటి అధిక నాణ్యత కలిగినది. దీని ఖరీదు చాలా ఉంటుందని భావిస్తున్నాం’ అని ఆయన చెప్పారు. పన్నా జిల్లా రాజ్‌పూర్‌కు చెందిన వినీతా గోండ్‌కు పటీ అనే ప్రాంతంలో ఆ వజ్రాలు లభ్యమయ్యాయి. డైమండ్ ఆఫీస్‌కు చెందిన ఈ ప్రాంతాన్ని వినీతా గోండ్ లీజ్‌కు తీసుకున్నారు.