హుజురాబాద్ : గెల్లు గెలుపు కోసం ఓ అభిమాని వినూత్న ప్రచారం చేపట్టాడు. హుజూరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గెలుపుకోసం భద్రాచలానికి చెందిన గిరిజనుడు తూతిక ప్రకాశ్ సైకిల్ యాత్ర చేపట్టాడు. రెండు రోజుల క్రితం సైకిల్‌పై బయలుదేరి గంటకు 22 కిలోమీటర్ల స్పీడ్‌తో బుధవారం హుజూరాబాద్‌కు చేరుకున్నాడు. 2016 ఏప్రిల్ 25 నుంచి తెలంగాణరాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా సైకిల్‌పై భద్రాచలం రామయ్యకు మొక్కుకుని టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం తనవంతు పాత్ర పోషిస్తున్నాడు.
బుధవారం హుజూరాబాద్ పట్టణంలోని కిందివాడ, మామిండ్లవాడ, బుడగజంగాలకాలనీ, గాంధీనగర్, పద్మనగర్‌లో సైకిల్‌పై తిరుగుతూ తన వాయిద్యంతో పాటలు పాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ చైతన్య పరుస్తూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలంటూ ప్రచారం చేసున్నాడు ప్రకాశ్. సైకిల్ కు ఇరువైపులా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాల ఫ్లెక్సీలను పెట్టుకుని, గులాబీ దుస్తులను ధరించి మైకు పట్టుకుని తానంతటతానే స్వచ్ఛంధంగా ప్రచారం చేస్తూ పార్టీ అభ్యర్థుల గురించి వివరిస్తున్నాడు.
తాను ఇంతకు ముందు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసినని ప్రకాష్ చెబుతున్నాడు. గెల్లు శ్రీనివాస్‌యాదవ్ నిఖార్సాయిన తెలంగాణ ఉద్యమకారుడని, ఆయనతో కలిసి ఉద్యమ సమయంలో పాల్గొని ఉద్యమాలు చేశానని ఈసందర్భంగా ప్రకాశ్ వెల్లడించాడు. ఉద్యమ నాయకుడు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపిస్తే హుజూరాబాద్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి సాధిస్తుందని ప్రకాశ్ ప్రచారం చేస్తున్నాడు.