హైదరాబాద్, ఏప్రిల్17 (నమస్తే తెలంగాణ) : మహిళల కోసం ట్రైబల్ ఆర్ట్ క్యాంప్‌ను నిర్వహించనున్నారు. గిరిజన సాంసృతిక పరిశోధన, శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో 20వ తేదీ నుంచి 24 వరకు మాసబ్‌ట్యాంక్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో జరుగనుంది. ఫ్యాబ్రిక్ పెయింటింగ్, బ్లాక్ ప్రింటింగ్, స్రీన్ ప్రింటింగ్ తదితర ఆధునిక కళలతోపాటు సంప్రదాయ గిరిజన కళలపై నిపుణులతో శిక్షణ ఇప్పిస్తామని అధికారులు వెల్లడించారు.
ఆసక్తి ఉన్న మహిళలు రూ. 2,500 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని, అభ్యర్థులకు గిరిజన సంక్షేమశాఖ, తెలంగాణ ప్రభుత్వం తరఫున సర్టిఫికెట్లు, ప్రతిభ చూపిన వారికి బహుమతుల ప్రదానం ఉంటుందని వెల్లడించారు. వివరాలకు 83338 00710 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.