అర్జున్ అంబటి హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘పరమపద సోపానం’. నాగశివ దర్శకత్వంలో గణపర్తి నారాయణరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తున్నది. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది.
శుక్రవారం ట్రైలర్ను హీరో శ్రీవిష్ణు విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలందజేశారు. యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిదని, ఇందులోని సోషల్ ఎలిమెంట్ ఆసక్తిని రేకెత్తిస్తుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఈశ్వర్, సంగీతం: డేవ్ జాండ్, దర్శకత్వం: నాగశివ.